బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఆధిక్యం

west bengal assembly by-election
west bengal assembly by-election

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి తరపు అభ్యర్థులు తమ ప్రత్యర్థిపై మెజారిటీ ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు స్థానాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపు దిశగా ఆధిక్యంలో ఉన్నారు. కలియాగంజ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యె ప్రమాద్‌ నాథ్‌ రాయ్ మరణించటంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. అంతేకాకుండా కరీంపూర్‌, ఖరగ్‌ పూర్‌ సదర్‌ నియోజకవర్గాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మహువా మొయిత్రా, దిలీప్‌ ఘోష్‌లు లోక్‌ సభకు ఎన్నికైనందున ఆయా స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగాయి. కాగా కలియాగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కమల్‌ చంద్ర సర్కార్‌ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఖరగ్‌పూర్‌ సదర్‌ నుంచి బిజెపి అభ్యర్థి ప్రేమచంద్ర కూడా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఇక కరీంపూర్‌లో టిఎంసి అభ్యర్థి బిమిలెందు సిన్హారా§్‌ు తను సమీప బిజెపి అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/