రాహుల్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు నిరసన

‘నా పేరు రాహుల్ సావర్కర్ కాదు’ అని రాహుల్ వ్యాఖ్య

BJP leaders
BJP leaders

ముంబయి: కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘రేప్ ఇన్ ఇండియా’ వ్యాఖ్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ‘నా పేరు రాహుల్ సావర్కర్ కాదు. నా పేరు రాహుల్ గాంధీ. ప్రాణాలైనా వదులుతాను.. కానీ, క్షమించమని అడగను’ అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు మండిపడుతున్నారు.

కాగా ఈరోజు మహారాష్ట్ర బిజెపి నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఇతర బిజెపి నేతలు ‘నేను సావర్కర్ ను’ అని రాసి ఉన్న టోపీలను ధరించి వచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. కాషాయ రంగు టోపీలపై తెల్లటి అక్షరాలతో ‘నేను సావర్కర్ ను’ అని రాసి ఉంది.

తాజా ఏపి వార్తల కోసంం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/