ఫోన్ లో బండి సంజయ్‌ను పరామర్శించిన నడ్డా, అమిత్ షా

bjp-leaders-phone-call-to-bandi-sanjay

హైదరాబాద్‌ః బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్ జైలు నుంచి రిలీజైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు జాతీయ నేతలు ఫోన్ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్మృతి ఇరానీ, తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ సహా పలువురు నేతలు సంజయ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిన పరిణామాలు గురించి ఫోన్ లో ఆరా తీశారు. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉంటుందని బండికి జాతీయ నేతలు మద్దుతిచ్చారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేయాలని సూచించారు. ఇటీవల మరణించిన బండి సంజయ్ అత్త వనజ ద్వాదశదినకర్మకు తరుణ్ చుగ్ హాజరుకానున్నారు.

కరీంనగర్ జైలు నుంచి ఏప్రిల్ 7 ఉదయం 9 గంటల సమయంలో బండి రిలీజ్ అయ్యారు. అన్నీ ఫార్మాలిటిస్ పూర్తయ్యాక బండి సంజయ్ ను అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. జైలు వద్దకు భారీ సంఖ్యలో బిజెపి శ్రేణులు రావడంతో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. టెన్త్​ హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో సంజయ్ కు హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.