టిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుల చేరిక

టిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుల చేరిక
TRS BJP

నిజామాబాద్‌: టిఆర్‌ఎస్‌లోనికి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని మాక్లూర్ మండలం బిజెపి మండల అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కల్లెడ సర్పంచ్ లావణ్యలు బిజెపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే టిఆర్‌ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/