చైనా, పాకిస్థాన్‌ వల్లే ఢిల్లీకి కాలుష్యం

vineet agarwal
vineet agarwal

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కాలుష్యంతో దేశమంతా కలత చెందుతున్నది. కాలుష్య నివారణకు ప్రభుత్వం తనవంతుగా కృషి చేస్తున్నది. అయితే రాజధానిలో కాలుష్య తీవ్రతకు పాకిస్థాన్‌, చైనా దేశాలే కారణమని ఉత్తరప్రదేశ్‌ బిజెపి నేత వినీత్‌ అగర్వాల్‌ ఆరోపిస్తున్నారు. ఈరెండు దేశాలు భారత్‌పై విషవాయువులను వదిలి వుండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈరెండు దేశాలు భారత్‌కు భయపడుతున్నాయని వినీత్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు పొరుగురాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం కారణమని కేజ్రీవాల్‌ చేస్తున్న వాదన సరైంది కాదని వినీత్‌ అగర్వాల్‌ అన్నారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/