బిజెపిలోనే ఉంటానని చెప్పాను

Daggubati Purandeswari
Daggubati Purandeswari

ఏలూరు: బిజెపి మహిళ నాయకురాలు పురందేశ్వరిని వైఎస్‌ఆర్‌సిపిలోకి తీసుకురావాలని ఆమె భర్త, వైఎస్‌ఆర్‌సిపి నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీ అధిష్టానం ఒత్తిడి చేస్తున్నట్లుగా వినిపిస్తున్న వార్తలు అందరికి తెలిసిందే. కాగా ఈ వ్యవహారంపై రసవత్తరంగా సమావేశాలు జరిగాయి. ఈ పరిణామాలు కాస్త దగ్గుబాటిని రాజీనామా వరకూ తీసుకువెళ్లింది. పశ్చిమగోదావరి పర్యటనలో ఉన్న పురందేశ్వరి మొదటిసారి ఈ విషమై స్పందిచారు. ఎన్నికలప్పుడు వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఆహ్వానం అందింది కాని బిజెపిలోనే ఉంటానని స్పష్టం చేశానన్నారు. వాళ్ళు అంగీకరించిన తరువాతే నా భర్త, నా కుమారుడు వైఎస్‌ఆర్‌సిపిలో చేరారన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఒత్తిడి చేస్తున్నారన్న విషయాన్ని వెంకటేశ్వరరావునే అడగాలని సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/