జాతీయవాద శక్తులన్నీ ఏకం కావాలి

ఎంఐఎం కోసమే టిఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్న లక్ష్మణ్‌

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: జాతీయ వాద శక్తులన్ని ఏకం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. సిఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఎంఐఎం కోసమే పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. సిఏఏకు మతం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందాలని మజ్లీస్‌ పార్టీ ప్రయత్నింస్తోందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన మజ్లీస్‌ పార్టీ సభలో ప్రజలను రెచ్చగొట్టే పద్ధతిలో వ్యాఖ్యానించారని అన్నారు. పాకిస్థాన్‌లో ఇస్లాం రాజ్యాంగం కొనసాగుతోందని, భారతదేశంలో హిందూ రాజ్యం ఉండొద్దా? అని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన మజ్లీస్‌ ముందు నగర ముస్లీంలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో స్పష్టం చేయాలని ఆయన అన్నారు. లేని పక్షంలో అసదుద్దీన్‌ ఓవైసికి తగిన బుద్ధి చెబుతామని లక్ష్మణ్‌ అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/