ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విపక్షాలకు మింగుడు పడటం లేదు

Giriraj Singh
Giriraj Singh

న్యూఢిల్లీ: నిన్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతు ఈ సారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేకే ప్రజలు పట్టం కట్టారని వీటిల్లో తేలింది. ఈ ఫలితాలు మింగుడు పడక విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. ఈ ఫలితాలు చూసిన తర్వాత మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు సహా విపక్షాలన్నీ రాజకీయ పరంగా ఐసీయూలో చేరాయి. కొందరైతే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తప్పని అంటున్నారు. ఇప్పుడు ఇవి తప్పు కావచ్చు. కానీ మే 23న అసలైన ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. అని ఆయన అన్నారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/