సీఎం కెసిఆర్‌కు చీమ కుట్టినట్టైనా లేదు

dk aruna
dk aruna

హైదరాబాద్‌: మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కీచకులపై జాలి, దయ చూపొద్దని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలంటూ డీకే. అరుణ దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11, 12 వ తేదీల్లో ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల పాటు మహిళ సంకల్ప దీక్ష చేయనున్నారు. మద్యం కారణంగానే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దిశ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ జరిగినా సీఎం కెసిఆర్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని డీకే అరుణ మండిపడ్డారు. దిశ తల్లిదండ్రులకు కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసిన పబ్‌లు దర్శమిస్తున్నాయన్నారు. తెలంగాణను ముఖ్యమంత్రి కెసిఆర్‌ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/