సెప్టెంబర్‌ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలి

Bandaru Dattatreya
Bandaru Dattatreya

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కెసిఆర్‌ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. మజ్లిస్‌కు భయపడి టిఆర్‌ఎస్‌ సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించడంలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/