మౌన దీక్ష ప్రారంభించిన బండి సంజయ్

bjp-leader-bandi-sanjay-mauna-deeksha-start-in-karimnagar

హైదరాబాద్ః బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో మౌన దీక్ష ప్రారంబించారు. గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు. ‘‘ఇదిగో కుర్చీ.. సమస్యలను పరిష్కరించు కేసీఆర్ అంటూ’’ కమలం శ్రేణులు యెద్దేవా చేశారు.

ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది. కాగా… ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317జీవో రద్దు కోసం జనవరిలో దీక్షకు దిగగా… అనుమతి లేదంటూ అప్పట్లో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భూములు, గిరిజన సమస్యపై బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ జగపతి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః