బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి సోనాలి మృతి

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు పలు కారణాలతో మరణించగా..తాజాగా బిగ్‏బాస్ సీజన్ 14 కంటెస్టెంట్, నటి, బిజెపి నాయకురాు సోనాలి ఫోగట్ మృతి చెందారు. సోమవారం (ఆగష్టు 22) రాత్రి ఆమెకు తీవ్ర గుండెపోటు రావ‌డంతో అక్క‌డిక్క‌డే ప్రాణాలు విడిచారు. ఫోగట్ వయసు 42. సోనాలి ఫోగట్ మరణించిన వార్తను ఆమె సోదరుడు వతన్ సింగ్ ధాకా ధృవీకరించారు. ఫోగట్ మరణంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోనాలి ఫోగట్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‏లోని భూథాన్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో సోనాలి జన్మించారు. ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజేపి టికెట్ పై ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసింది.

సోనాలి ఫోగట్ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. ఆమెకు టిక్‌టాక్‌లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. మొహమ్మద్ రఫీ పాట అయిన రుఖ్ సే జరా నికాబ్ తో హతా దే మేరే హజూర్ సాంగ్ పోస్ట్ చేశారు. సోనాలి ఫోగట్ భ‌ర్త సంజ‌య్ ఫోగ‌ట్ 2016లో అనుమానాద‌స్ప రీతిలో త‌న ఫామ్‌హౌజ్‌లో మృతి చెందారు. ప్రస్తుతం ఆమె కుమార్తె యశోధర ఫోగట్‌తో కలిసి ఉంటున్నారు. ఇక ఈమె మరణ వార్త తెలుసుకున్న అభిమానులు , రాజకీయ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.