మహారాష్ట్రలో దూసుకుపోతున్న బిజెపి

హరియాణా డౌటే

bjp
bjp

ముంబయి:అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ సగానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో లభించిన స్థానాలతో పోలిస్తే, బీజేపీ శివసేన కూటమికి సీట్లు తగ్గినప్పటికీ, అధికార పీఠం మాత్రం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 288 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా, ప్రస్తుతం బీజేపీ 162 స్థానాల్లో ముందంజలో ఉండి, ఒక చోట గెలిచింది. కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి 93 స్థానాల్లో, ఇతరులు 32 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన అవతరించనుంది.

ఇక హరియాణా విషయానికి వస్తే, హంగ్ ఖాయంగా తెలుస్తోంది. 90 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 46 కాగా, ఏ పార్టీ కూడా అన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు లేవు. అయితే, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు పుష్కలం. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ 38, కాంగ్రెస్ 32, ఐఎన్ఎల్డీ 2, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10, ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో జేజేపీ కింగ్ మేకర్ గా అవతరించనుండగా, ఇండిపెండెంట్లు అత్యంత కీలకం కానున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/