మద్యాన్ని సిఎం కెసిఆర్‌ నిషేధించాలి

డీకే అరుణ ఆధ్వర్యంలో బిజెపి మహిళా సంకల్ప దీక్ష ప్రారంభం

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: తెలంగాణలో దిశ హత్య తర్వాత మద్యంపై చర్చ సాగుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ మద్దతు పలుకుతూ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను తూర్పారబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ అంటూ కెటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారని విమర్శించారు. బిజెపి మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని పేర్కొన్నారు.

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ తల్లి కడుపుకోతకు మద్యం కారణం కాకూడదన్నారు. సిఎం కెసిఆర్‌ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాలకోసం దీక్ష చేయడంలేదని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలను నిరోధించేందుకే తాము సంకల్ప దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్షతో.. తమ ఉద్యమం ఆగదన్నారు. మద్య నిషేధం కోరుతూ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/