వైఎస్‌ఆర్‌సిపిది నియంతృత్వ ధోరణి

స్థానిక సమరంపై డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన కన్నా, పవన్‌ కళ్యాణ్‌

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

విజయవాడ: ఏపిలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ఆర్‌సిపికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. విజయవాడలో బిజెపి-జనసేన ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్‌ను కన్నా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ లు ఆవిష్కరించారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కన్నా మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ విషయంపై పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం ఉండటం లేదని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/