రానున్న ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేస్తాం

Muralidhar Rao
Muralidhar Rao


హైదరాబాద్‌: కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సంబరాల్లో బిజెపి నేత మురళీదర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన. రాష్ట్రంలో అసలైన ప్రతిపక్షం అంటే ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను ప్రతిక్షణం వెంటాడుతామన్నారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదని, రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/