ఓటమికి కారణం స్వయంకృపరాధమే!

BJP_CONGRESS

ఒక రాష్ట్రానికి జరిగే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ పార్టీని లీడ్‌ చేసే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎదుర్కొని ఎన్నికల్లో నిలిచి గెలవడానికి కేంద్ర పార్టీ అయినప్పటికీ స్థానికంగా ఉన్న బలమైన నాయకున్ని ఎదుర్కోవడానికి అంతకుమించిన బలవంతుడైన స్థానికుడైన నాయకున్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. కానీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థికి సరిదీటుగా లేని వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకొని రంగంలోకి దిగి కేంద్రం తెచ్చిన చట్టాలను, దేశరక్షణ విషయంలో కేంద్రం పాటించిన విషయాలను, మత అస్తిత్వ విషయాలపై ఫోకస్‌ చేసి రాష్ట్ర ఎన్నికల్లో సైతం ప్రధానమంత్రి ఇమేజ్‌ను ఉపయోగిస్తే ఏ రాష్ట్రంలోనైనా ఫలితాలు మెరుగుగా ఉండవని తెలుసుకోవాలి.

దే వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా సైతం ఆసక్తి నెలకొని ఉన్న భారత్‌ రాజ ధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలపై పలువ్ఞరు విశ్లేషకులు,పలు రాజకీ య పార్టీల నాయకులువారి వారి అభిప్రాయాలను తెలియచేస్తూ ఎన్నికల ఫలితాలకు భిన్న భాష్యా లు చెబుతున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘోరపరాజయానికి కారణా లను పలువ్ఞరు విశ్లేషకులు వారివారి కోణాలలో విశ్లేషిస్తున్నప్ప టికీ బిజెపి చవిచూసిన ఫలితానికి కారణం మాత్రం స్వయం కృతాపరాధంగానేభావించాలి. తప్పితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల మూలంగా దేశంలోని ప్రజలందరూ మోడీ, అమిత్‌షాల విధా నాలకు వ్యతిరేకంగా ఓటు వేశారనో, లేదా ఎన్నార్సీ, సిఎఎ, రామ జన్మభూమి, ఆర్టికల్‌ 370రద్దు విషయాలను దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విశ్లేషణలలో ఏమాత్రం నిజం లేదనే చెప్పాలి.

ఎందుకంటే రాష్ట్రాల లోజరిగే ఎన్నికలకు రాష్ట్రంలోని స్థానిక ప్రజలు దేశ పరిస్థితులకు, కేంద్రం చేసే చట్టాలకు వ్యతిరేకం గానో, అనుకూలంగానో స్పందించి ఓటు వేసేవారు అతి తక్కువ ఉంటారని గమనించాలి.రాష్ట్రంలో అమలు జరిపేఉచిత సంక్షేమ పథకాల,అభివృద్ధి పనుల ప్రభావంతోనే ప్రస్తుతం ఏ రాష్ట్రం లోని ప్రజలైనా తమ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫలానా వ్యక్తి ఫలానా పార్టీ ఉంటే ఇంకాస్త అభివృద్ధి చెందుతుందని, తమకు సైతం లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో ఓటు వేస్తారనిగమనిం చాలి. ఇందుకు ఉదాహరణలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చవిచూసిన ఫలితాలను, తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అందుకున్న మెరుగైనఫలితాలను గమనించవచ్చు

.అలాగే ఆరు నెలలక్రితం జరిగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఏకపక్ష విజయ ఫలితాలు, ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి చవిచూసిన ప్రతికూల ఫలితాలను గమనించవచ్చు.అంటే రాష్ట్రాలలోనిప్రజలు ప్రధానిని ఎన్నుకోవాల్సి ఎన్నికలకు,ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సినఎన్నిక లపై స్పష్టమైన అవగాహనతో స్పష్టమైన తీర్పు నిస్తున్నారు

స్వయంకృతాపరాధాలు ఒక రాష్ట్రానికి జరిగే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ పార్టీని లీడ్‌ చేసే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎదుర్కొని ఎన్నికల్లో నిలిచి గెలవడానికి కేంద్ర పార్టీ అయినప్పటికీ స్థానికంగా ఉన్న బలమైన నాయకున్ని ఎదుర్కో వడానికి అంతకుమించిన బలవంతుడైన స్థానికుడైన నాయకున్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి.

అలాగే రాష్ట్ర ప్రజల అవ సరాలు,రాష్ట్రంలో ఇప్పటికే అమలవ్ఞతున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి అవసరాలు, మౌలిక వసతులు, విద్య,వైద్యం, కూడు, గూడు, గుడ్డ తదితర కనీస అవసరాలను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎలా తీరుస్తారో చెప్పి,ప్రత్యర్థి పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థి తప్పిదాలను ఏకరువ్ఞ పెట్టాలి. కానీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థికి సరిదీటుగా లేని వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకొని రంగంలోకి దిగి కేంద్రం తెచ్చిన చట్టాలను, దేశరక్షణ విషయంలో కేంద్రం పాటించిన విషయా లను, మత అస్తిత్వ విషయాలపై ఫోకస్‌ చేసి రాష్ట్ర ఎన్నికల్లో సైతం ప్రధానమంత్రి ఇమేజ్‌ను ఉపయోగిస్తే ఏ రాష్ట్రంలోనైనా ఫలితాలు మెరుగుగా ఉండవని తెలుసుకోవాలి.

ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీ రెండు ర్యాలీలలో ప్రసంగించారు. అయితే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించింది ఢిల్లీ ప్రజలు మోడీని ఎన్నుకో డానికో లేదా తిరస్కరించడానికో కాదని వారు గుర్తుంచుకుని ఉంటే బాగుండేది. ఈ విషయం గత 2019మే నెలలో ఢిల్లీలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 50శాతంపైగా ఓట్లతో బిజెపి ఢిల్లీ లోని ఏడు స్థానాలలో ఆరుస్థానాలను కైవసం చేసుకొని విజయ ఢంకా మ్రోగించింది.

కారణం అవి దేశ ప్రధానిని ఎన్ను కోవా ల్సిన ఎన్నికలు కాబట్టి. నరేంద్రమోడీని ప్రధానిగా ఢిల్లీ ప్రజలు సమర్థించాల్సిన తరుణం కాబట్టి.కానీ ప్రస్తుతం జరిగిన ఢిల్లీ ఎన్నికలు వారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి జరి గినవని స్పష్టంగా అర్థం చేసుకొని దేశ ప్రధాని ప్రచారం చేసిన ప్పటికీ వారు వారి ముఖ్యమంత్రిని ఎన్నుకొనే క్రమంలో చాలా స్పష్టమైన తీర్పునిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీకి పట్టం కట్టారు. రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ఫలితా లను కేంద్రంలోని మోడీప్రభుత్వ పనితీరుకు కొలబద్దగా పోల్చి చూడాల్సిన అవసరం లేదు.

ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి బిజెపి నాయకుల పనితీరుకు మాత్రమే ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఆపాదించాలి. అయితే బిజెపి అధిష్టానం రాష్ట్రాలలో ఎదురవ్ఞతున్న ఘోరమైన ఫలితాలను విశ్లేషించుకుంటే హర్యానా లో ఊహించిన దానికంటే ఘోరమైన ఫలితం, మహారాష్ట్రలో అధికారం కోల్పోవడం,జార్ఖండ్‌ఎన్నికల్లో నష్టం, ప్రస్తుతం ఆప్‌కు సవాలు చేయలేని స్థితిలో బిజెపి చేరుకోవడం,బిజెపి రాష్ట్రస్థాయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రభుత్వాలను కైవసం చేసుకునే స్థితికి రానురానూ దూరమవ్ఞతున్నదని అర్థమవ్ఞతోంది.

దీనికి బిజెపి కేంద్ర నాయకత్వం ఆయా రాష్ట్రాలలో మన్ముందు జరగ బోయే ఎన్నికలలోనైనా మోడీ మానియాను మాత్రమే ఉపయో గించకుండా ఆయా రాష్ట్రాలలో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థు లను, గ్రామస్థాయి నుండి జిల్లా,రాష్ట్ర స్థాయిల వరకు బలమైన పార్టీ నాయకులను ఏర్పాటు చేసుకొని ఇప్పటి నుండే సమరానికి సిద్ధంకావాలి. ఆయా రాష్ట్రాలలో వారు ఎదుర్కోవాల్సిన శత్రు పార్టీ నాయకులపై గెలుపుకోసం వ్యూహాత్మక విధివిధానాలతో, ఆయా రాష్ట్రాలలో అమలయ్యే సంక్షేమపథకాల ప్రభావాన్ని అంచనావేసి అందుకు అనుగుణం గా ముందుకు సాగితే ఫలితాలు మెరుగుగా ఉండే అవకాశం ఉంది.

కేజ్రీవాల్‌ క్రేజ్‌కు కారణాలు

ఒక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి నుంచి ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి స్థానానికి చేరుకున్నప్పటికీ సాధారణ వ్యక్తిలా నడుచు కోవడం, సామాన్యునిలా ఎలాంటి ప్రోటోకాల్‌, సెక్యూరిటీ, హంగామా లేకుండా ప్రభుత్వ సొమ్మును తన హంగామా కోసం వినియోగించకుండా ప్రతిపైసా రాష్ట్ర ప్రజల కనీస అవసరాల కోసం వినియోగించడం, సామాన్యుల కనీస అవసరాలను తెలు సుకొని తీర్చడం ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కున్న క్రేజ్‌కు ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ విద్యావిధానం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది.

సామాన్యు నికి విద్య,వైద్యం,కనీస అవసరాలను అతి చేరువ చేసిన ముఖ్య మంత్రిగా దేశంలోనే పేరెన్నికగా నిలిచారు కేజ్రీవాల్‌. ఢిల్లీపాలన పై కేంద్రంతో జరుగుతున్న పోరాటం,ముఖ్యపార్టీ నాయకుల నిష్క్రమణ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఇతరత్రా ఎన్ని ప్రతి కూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మానసికంగా దృఢంగా ఉండి పార్టీని చెక్కుచెదరనీయకుండా ముందుకు నడిపారు. తన పాల నలో పాఠశాలలు, ప్రజారోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం, సబ్సిడీ రేటుకు విద్యుత్‌, త్రాగునీటిని అందించడంపై దృష్టి సారించిన నాయకుడిగా అతను తన ఇమేజ్‌ను రెండింతలు చేసుకొని ఢిల్లీ ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించారు.

ఢిల్లీలో బిజెపి ప్రాబల్యం తగ్గించడానికి అందరిలా కాకుండా బిజెపిని, మోడీని విమర్శించకుండా కొంత మేర విమర్శలు తగ్గించి సిఎఎ, ఎన్నార్సీ లాంటివి దేశానికి సంబంధించిన అంశాలపై ప్రధానిపై విమర్శలకు కేజ్రీవాల్‌ వ్యూహాత్మకంగానే దూరంగా నిలిచారు. ఆర్టికల్‌ 370రద్దు నుండి రామాలయ నిర్మాణ తీర్పువరకు, అలాగే జె.ఎన్‌.యు, షాహీన్‌బాగ్‌ వివాదాలకు సైతం దూరంగా ఉంటూ అతిగా విమర్శలు గుప్పించకుండా కేంద్రప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ వ్యూహాత్మకంగా బిజెపి అనుకూల సామాన్య ఓటు బ్యాంకును తన చెంతకు చేరేలా చేసుకున్నారు.

కాంగ్రెస్‌ విషయానికొస్తే..

ఢిల్లీ రాష్ట్రంపై కాంగ్రెస్‌ జెండా గురించి చెప్పాలంటే 2013 తర్వాతే కాంగ్రెస్‌ పతనం మొదలైంది.2014లో కొంత బలహీన పడి కాలం గడుస్తున్న కొద్దీ ఆమ్‌ ఆద్మీ పార్టీ పుంజుకుంటున్న కొద్దీ అక్కడ ఆప్‌ వర్సెస్‌ బిజెపిలా రాజకీయ వాతావరణం తయారై చివరకు ఒక్క సీటు సైతం గెలుచుకోలేని స్థితిలోకి చేరి కేవలం నాలుగు శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి చేరుకుంది. దశాబ్దాల చరిత్రగల జాతీయ పార్టీ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలనే కసితో ఆమ్‌ ఆద్మీ పార్టీకి తన ఓటు బ్యాంకు బదలాయించి కేవలం ఐదు శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పార్టీ అధ్యక్షునిగా లేనప్పటికీ పార్టీ ముఖ్యనాయకునిగా ఉన్న రాహుల్‌ గాంధీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండం, అది ఏ విధమైన విజయాన్ని అందించలేకపోగా అతి తక్కువ ఓటు శాతం నమోదు కావడం రాహుల్‌ నాయకత్వానికి మచ్చతెచ్చేలా తయారైంది.

  • శ్రీనివాస్‌ గుండోజు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/