మైనార్టీలో కమల్‌నాథ్‌ ప్రభుత్వం!

kamal nath
kamal nath

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నదని ఇవాళ ఆ రాష్ట్ర బిజెపి శాఖ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు లేఖ రాసింది. సియం కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని బిజెపి గవర్నర్‌ను కోరింది. అసెంబ్లీని సమావేశపరిస్తే..కమల్‌నాథ్‌ ప్రభుత్వం కూలిపోతుందని బిజెపి తన లేఖలో పేర్కొన్నది. మధ్యప్రదేశ్‌లోని బిజెపి నేత గోపాల్‌ భార్గవ ఈ కామెంట్స్‌ చేశారు. ఆ రాష్ట్రంలో బిజెపి లోక్‌సభ ఎన్నికల 24 సీట్లను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. కాని స్వల్ప మెజార్టీతోనే సియం కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/