తెలుగు రాష్ట్రాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

bjp-announced-mlc-candidates

హైదరాబాద్‌ః తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న పలు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పేరు ప్రకటించింది. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు , చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, కడప , అనంతపురం , కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ లను బరిలో దింపుతున్నట్లు బిజెపి ప్రకటించింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుండగా 23వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మార్చి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనుండగా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో పూర్తి కానుంది.