తమ పార్టీ ఎంపీలకు విప్‌ జారీచేసి కాంగ్రెస్‌, బీజేపీ

సభ్యులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలి

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు పలు కీలక బిల్లులు రాజ్యసభ ముందుకు రానున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. సభ్యులు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మరోవైపు లిఖింపూర్ ఖేరీ వ్యవహారం, 12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ సహా విపక్షాలు.. తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

లఖీంపూర్‌ ఖేరీ ఘటన, సిట్‌ నివేదిక, హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ తేనీని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌తో ఎంపీ మానికమ్‌ ఠాగూర్‌ లోక్‌సభ స్పీకర్‌కు అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ నోటీసు ఇచ్చారు. అదేవిధంగా మోదీ సర్కార్‌ ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నదనే అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ నోటీసు ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/