క్రిస్టియన్‌ మైనార్టీలకు బిజెపి వ్యతిరేకం

mizoram
mizoram

మిజోరమ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం
ఐజ్వాల్‌: క్రిస్టియన్‌ వ్యతిరేకపార్టీ అయిన బిజెపి మిజోరమ్‌లో దొడ్డిదారిన ప్రవేశించి అధికారంలోనికి రావాలని చూస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈనెల 28వ తేదీ జరిగే ఎన్నికల్లో మతతత్వ పార్టీ దొడ్డిదారిన రావాలనికుట్రలుచేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. మిజోరం జనాభాలో 87శాతం మంది క్రిస్టియన్లు ఉన్నట్లు 2011 జనాభాల లెక్కలు చెపుతున్నాయి. ఈశాన్యరాష్ట్రాల్లో మిజోరం ఒక్కటే ఇపుడు కాంగ్రెస అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ల్యూజిన్‌హో ఫెలీరో ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ బిజెపి మైనార్టీలు, క్రిస్టియన్లకు వ్యతిరేకమని, క్రైస్తవులు, ఇతర మైనార్టీలపట్ల అసహనంతో ఉందని ఫెలీరో వెల్లడించారు. డిసెంబరు 25వ తేదీని సుపరిపాలన దినోత్సవంగా ఎందుకు జరుపుతున్నదంటే బిజెపి ఆరోజున దొడ్డిదారిన అధికారం చేపట్టి మిజోరమ్‌లో వచ్చే క్రిస్మస్‌ను సుపరిపాలన దినంగా నిర్వహిస్తుందని ఎద్దేవాచేసారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన ఫెలిరో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటనపై మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వ హయాంలోనే వచ్చే క్రిస్మస్‌ మిజోరమ్‌లో జరుపుకుంటామని ప్రకటించడాన్ని విమర్శించారు. 2014లో బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం క్రిస్మస్‌రోజు డిసెంబరు 25వ తేదీని సుపరిపాలన దినంగా జరుపుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా డిసెంబరు 25వ తేదీ కావడం గమనార్హం. మిజోనేషనల్‌ఫ్రంట్‌ సాయంతో బిజెపి అడ్డదారిలో మిజోరం రాజకీయాల్లోనికవస్తోందని, ఈశాన్యరాష్ట్రాల్లో గతంలో ఇదే చేసారని బిజెపిని విమర్శించారు. ప్రతిపక్షంలోని మిజోనేషనల్‌ఫ్రంట్‌ మాజీ ముఖ్యంమమరతిజోరామ్‌తంగా ఆధ్వర్యంలోపనిచేస్తోంది. ఈశాన్య ప్రజాస్వామ్యకూటమి(నెడా)లో సభ్యత్వం కూడా ఉంది. బిజెపి ఆద్వర్యంలోనే ఈశాన్యరాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ ఒకే కూటమిగా ఆవిర్భవించాయి. 2016లోనే నెడా ఆవిర్భవించింది.కాంగ్రెస్‌ పార్టీ పరంగా ఎంఎన్‌ఎఫ్‌ మిజోరమ్‌లో బిజెపితో ఎన్నికలనంతర పొత్తును ఏర్పాటుచేసుకుందని ఆరోపించింది. అయితే బిజెపి, ఎంఎన్‌ఎఫ్‌ రెండూ వ్యతిరేకించాయి. మిజోరమ్‌లోని జోరామ్‌ పీపుల్స్‌మూవ్‌మెంట్‌ రెండు రాజకీయపార్టీల సమ్మేళనం, మరో ఐదు ఇతర సంస్థల ఆధ్వర్యంలో పనిచేస్తునఆనయి. ఈ సంస్థప కాంగ్రెస్‌పార్టీకూడా విమర్శలదాడిచేసింది. స్వతంత్ర అభ్యర్ధులుగా ఈ సంస్థల ప్రతినిదులు 35 మంది ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆరోపించింది. జెఎన్‌పి మాట్లాడుతూ ఎలాంటి ముదస్తు, ఎన్నికల తర్వాత కూటమి బిజెపితో చేసుకోలేదని స్పష్టంచేసింది. జెపిఎం పునాదులు మిజోరమంలో భద్రంగా ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజలసంఏమంకోసమే పనిచేస్తున్నామని, ఎలాంటి బిజెపితో పొత్తులులేవని జడ్‌పిఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డా.కెన్నెత్‌ చాంగ్‌లియానా వెల్లడించారు. 35 జడ్‌పిఎం అభ్యర్ధులు స్వతంత్రులుగా పోటీచేస్తారని, ఏడాదిక్రితమే పార్టీ ఆవిర్భవించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ ఎన్నికల్లో పోటీచేయలేదని పేర్కొన్నారు ఎన్నికలసంఘం తమకు గుర్తింపునిస్తుందని, పోటీతర్వాతనే తమకు గుర్తులుకేటాయిస్తుందని, ఇందుకు ఓట్లశాతం, ప్రజాప్రతినిదుల సంఖ్యకూడా కీలకం అవుతుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో విజయం కోసం జడ్‌పిఎం ప్రతినిధులు ప్రతిజ్ఞచేసారని, అంతేకాకుండా ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్నది కూడా ప్రకటించారని ఆయన గుర్తుచేసారు.