బస్సు టికెట్లపై బిజెపి కార్యకర్తల ఆందోళన

Raja Singh
Raja Singh

తిరుపతి: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్సు టికెట్లపై అన్యమత ప్రకటనలను నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ.. తిరుపతిలో బస్‌టికెట్ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఖఈ విషయం సిఎం జగన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. ఈ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం విషయంలో స్పందించినట్లే ఇక్కడ కూడా సీఎం స్పందించాలని కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/