‘బిట్‌శాట్’ ప్రిపరేషన్
నాణ్యమైన ఇంజినీరింగ్, సైన్స్ కోర్సులు చదువుతూనే పరిశోధనకు ఆస్కారం, పారిశ్రామిక అనుభవం పొందాలనుకుంటే బిర్లా సంస్థలు చక్కని గమ్యస్థానం. అందించే కోర్సుల ద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందింపజేస్తూ సమాజావసరాలకు అనుగుణంగా ఆధునికీరిస్తూ ఉంటారు. విద్యార్థి తన ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంచుకునే వెసులుబాటు (ప్లెక్సిబుల్ లర్నింగ్) బిట్స్ ప్రత్యేకత. ఇక్కడ చదివినవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఇంటర్మీడియట్ చదివినవారికి మూడురకాల ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది బిట్స్. (ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో చదువుతున్న ప్రధాన కోర్సుతో పాటు విద్యార్థి ఆసక్తి, ప్రతిభలను బట్టి మైనర్ ప్రోగ్రామంలో కోర్సులనూ పూర్తి చేయవచ్చు)
బిఇ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ విభాగాలు.
బిఫార్మసీ: ఈ కోర్సుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది.
ఎమ్మెస్సీ: మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలాజికల్ సైన్సెస్, ఎకనామిక్స్, జనరల్ స్టడీస్.
అర్హత: ఇంజినీరింగ్, ఎమ్మెస్సీ కోర్సులకు ఇంటర్‌లో ఎంపిసి గ్రూప్ తప్పనిసరి. బీఫార్మసీకి బైపిసి, ఎంపిసి రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సంబంధిత గ్రూప్‌లో కనీసం 75 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60శాతం మార్కులు ఉండాలి. 2020లో పరీక్షలు రాస్తున్నవారు, 2019లో ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31
ఆన్‌లైన్ పరీక్షలు: మే 16 నుంచి 25 వరకు
వెబ్‌సైట్:https://www.bitsadmission.com
ప్రాక్టీస్ స్కూల్
అకడమిక్స్, పరిశ్రమలకు మధ్య చక్కని వారధిగా బిట్స్‌ప్రాక్టిస్ స్కూల్ విద్యార్థికి ఉపయోగపడుతుంది. బోధనలో నేర్పే అంశాలకు పారిశ్రామిక రంగాన్ని జత చేయడం ద్వారా అనుభవపూర్వకంగా విద్యార్థులు తమ సబ్జెక్టుల్లో పరిపూర్ణత పొందే వీలు దీని ద్వారా కలుగుతుంది. సంబంధిత పరిశ్రమలు, కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణుల పర్యవేక్షణలో విద్యార్థి తాను నేర్చుకున్న విషయాల ఆచరణాత్మకతను గ్రహించడానికి ఇదో మంచి అవకాశం. రెండేళ్ల కోర్సు పూర్తి చేశాక ప్రాక్టీస్ స్కూల్-1 ద్వారా 8 వారాల శిక్షణ పొందవచ్చు. ఇది సాధారణంగా వేసవి సెలవుల్లో ఉంటుంది. దీనితర్వాత ఐదున్నర నెలల పాటు ప్రాక్టీస్‌స్కూల్-2 ద్వారా విద్యార్థి విభిన్న పరిశ్రమలు, కంపెనీల్లోరకరకాల ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు.
కటాఫ్ ఎంత?
బిట్‌శాట్ కటాఫ్ స్కోర్లు ఏయేటి కాయేడు పెరుగుతున్నాయి. బిట్‌శాట్-2019 స్కోరుతో పిలానీ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ కటాఫ్ 383, గోవా క్యాంపస్ 352, హైదరాబాద్ క్యాంపస్ 342గా ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ మూడు క్యాంపస్‌ల్లోనూ వరుసగా 341, 310,308గా ఉన్నాయి.
2020 పరీక్షకు కటాఫ్‌లు మారవచ్చు. కనీసం 260 మార్కులు సాధించినవారికి ఏదో ఒక ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో సీటు దక్కే వీలుంది. కెమికల్, సివిల్ బ్రాంచీల కంటే ఎమ్మెస్సీ, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో చేరడానికి గత ఏడాది ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అందువల్ల ఎమ్మెస్సీ కటాఫ్ స్కోర్ వాటికంటే ఎక్కువగా ఉంది.

బిట్‌శాట్ ఇలా:
ఇది ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ఇందులో 4 విభాగాలుంటాయి. పార్ట్-1, ఫిజిక్స్ 40, పార్ట్-2, కెమిస్ట్రీ 40చ పార్ట్-3: ఎ.ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 15,బి.లాజికల్ రీజనింగ్ 10చ పార్ట్-4, మ్యాథ్స్/బయాలజీ (బీఫార్మసీ కోసం) 45 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 ప్రశ్నలు. వీటికి 3 గంటలు కేటాయించారు. సరైన జవాబుకు 3 మార్కులు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.
బోనస్ ప్రశ్నలు:
నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నలన్నింటికీ జవాబులు గుర్తించినవారికి అదనంగా 12 ప్రశ్నలు లభిస్తాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తిస్తే మార్కులూ ఆదనంగా లభిస్తాయి.మ్యాథ్స్/ బయాలజీ, ఫిజిక్స్, కెమ్సిస్ట్రీ ఒక్కో సబ్జెక్టు నుంచి 4 చొప్పున ఇవి వస్తాయి. బోనస్ ప్రశ్నలను ఆన్సర్ చేస్తూ లేదా చేసిన తర్వాత కానీ మొదటి 150 ప్రశ్నలను తిరిగి చూసుకోవడానికి గానీ, వాటి సమాధానాలను మార్చడానికిగానీ సాధ్యం కాదు.
అత్యుత్సాహంతో బోనస్ ప్రశ్నలను ఎంచుకునేకంటే మొదటి 150 ప్రశ్నలను జాగ్రత్తగా ఆన్సర్ చేయడం మేలు. ఇంటర్ పరీక్షల్లో వివిధ బోర్డుల్లో టాపర్లుగా నిలిచినవారు బిట్‌శాట్ రాయకుండానే మేలు. ఇంటర్ పరీక్షల్లో వివిధ బోర్డుల్లో టాపర్లుగా నిలిచినవారు బిట్‌శాట్ రాయకుండానే నేరుగా ప్రవేశం పొందవచ్చు. మెరిట్ విద్యార్థులకు ఉపకారం వేతనం లభిస్తుంది.
ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన వీరికి 15 నుంచి వందశాతం ట్యూషన్ ఫీజులో రాయితీ లభిస్తుంది. ప్రతి సంవత్సరం 30శాతం మంది విద్యార్థులు ఈ తరహా ప్రోత్సాహకాలను అందుకుంటున్నారు. బిట్‌శాట్ స్కోర్‌తో నిట్ (ఎన్‌ఐఐటి) యూనివర్సిటీ ప్రవేశాలు కల్పిస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/