ఇండియాలో బిట్‌ కాయిన్‌ ఇకపై చట్టపరం

సుప్రీం తీర్పుతో మళ్లీ సేవలు ప్రారంభించనున్న క్రిప్టో కరెన్సీ సంస్థ

Bitcoin
Bitcoin

న్యూఢిల్లీ: భారత దేశంలో బిట్ కాయిన్ మళ్ళీ అందుబాటులోకి రానుంది. కొన్నేళ్లుగా బిట్ కాయిన్ సహా అనేక క్రిప్టో కరెన్సీల పై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన నిషేధం చెల్లదని ఇటీవల సుప్రీం కోర్ట్ తీర్పు వెలువరించింది. దీంతో క్రిప్టో కరెన్సీ సంస్థలు మళ్ళీ ఇండియా లో తమ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమం ఐంది. త్వరలోనే ట్రేడింగ్ జరిపేందుకు క్రిప్టో సంస్థలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. డిజిటల్ కరెన్సీ గానూ పేర్కొనే బిట్ కాయిన్ వంటి ఊహాజనిత కరెన్సీ లను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు అన్నీ తమ వంతు కృషి చేస్తున్నాయి. కానీ అమెరికా, కెనడా, చాలా వరకు యూరోప్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, రష్యా వంటి ప్రధాన దేశాలు బిట్ కాయిన్ చెలామణిని అంగీకరిస్తున్నాయి. అందుకే భారత్ సహా ఇతర వర్ధమాన దేశాల్లోనూ ఈ కరెన్సీలను విస్తృతం చేయాలని ఫిన్ టెక్ రంగలోని స్టార్టుప్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, బిట్ కాయిన్ సహా ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రిప్టో కరెన్సీ లను ఏ ప్రభుత్వ రంగ సంస్థ లేదా ఒక దేశం నియంత్రించటం లేదు కాబట్టి అలాంటి కరెన్సీ లావాదేవీలు చట్ట విరుద్ధం అని ఇండియా వంటి దేశాల అభిప్రాయం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/