కొత్తకారు కొనేవారికి శుభవార్త..కార్లపై భారీ డిస్కౌంట్
ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 50,000 డిస్కౌంట్

ముంబయి: కొత్తకారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నావారికి శుభవార్త కార్ల తయరీ కంపెనీలు వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా కారు కొనుగోలుపై కనీసం రూ.50,000 డిస్కౌంట్ పొందవచ్చు. మారుతీ సుజుకీ, హ్యుండాయ్ , టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు అదిరిపోయే తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. రూ.5 లక్షల లోపు ధర ఉన్న ఎంట్రీ లెవెల్ విభాగంలో టాటా టియాగో కారుపై రూ.85,000 వరకు, మారుతీ ఆల్టో కారుపై రూ.60,000 వరకు, డాట్సన్ రెడిగో కారుపై రూ.59,000 వరకు, రెనో క్విడ్‌పై రూ.57వేల వరకు, హ్యుండాయ్ శాంట్రో కారుపై రూ.55వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉన్న విభాగంలోని కార్ల విషయానికి వస్తే.. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 కారుపై రూ.75 వేల వరకు తగ్గింపు ఉంది. మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్టీ కారుపై రూ.71,000 వరకు, మారుతీ స్విఫ్ట్ మోడల్‌పై రూ.70 వేల వరకు, మారుతీ ఇగ్నిస్ మోడల్‌పై రూ.65 వేల వరకు ప్రయోజానాలు సొంత చేసుకోవచ్చు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/