సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ సిఎం కెసిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీరు ఆయురారోగ్యాల‌తో ప్ర‌జాసేవ‌లో ముందుకు సాగాల‌ని హృద‌య‌పూర్వ‌కంగా కోరుకుంటున్నాన‌ని అని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.


కారణ జన్ములైన సిఎం కెసిఆర్‌ వల్లే దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని అన్నారు. కెసిఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. కెసిఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజని చెప్పారు. ‘మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని మంత్రి హరీశ్‌ రావుట్వీట్‌ చేశారు.


జ‌న హృద‌య నేత, ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్సిఎం కెసిఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. కెసిఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మ‌హ‌బూబాబాద్‌లో మొక్క‌లు నాటారు.


మరోవైపు సిఎం కెసిఆర్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, త్రిపుర ముఖ్య‌మంత్రి విప్ల‌వ్‌దేవ్ కుమార్ త‌దిత‌రులు ట్విట్ట‌ర్ ద్వారా సిఎం కెసిఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయన క‌ల‌కాలం ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆకాంక్షించారు. మాతా త్రిపురసుంద‌రి ఆశీర్వాదంతో కెసిఆర్ ఆరోగ్యంగా, సుఖ‌సంతోషాల‌తో ఉండాల‌ని త్రిపుర సిఎం ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/