ఆ మాత్రలతో జాగ్రత్త!
మహిళలు- ఆరోగ్య సమస్యలు
గర్భ నిరోధక మాత్రల వినియోగంపై మిచిగాన్ యూనివర్సిటీ అధ్యయనం చేసి ఇష్టారాజ్యంగా వాడొద్దని చెబుతోంది.. కుటుంబ నియంత్రణ మాత్రలను వాడుతున్న 702 మంది మహిళలపై సర్వే నిర్వహించగా, 33 శాతం గతంలో అశ్రద్ధ వహించటంతో గర్భం దాల్చామని, ఆ భయంతోనే మాత్రలు వినియోగిస్తున్నట్టు చెప్పారు.
49 శాతం గర్భం వస్తుందన్న భయంతో వాడుతున్నామని చెప్పారు.. మిగతా వారు మరో 2,3 కారణాలనూ జోడించారు… వారికున్న ఇతర ఆరోగ్య సమస్యలనూ అధ్యయనం చేశారు… ఫలితాలను చూసిన తర్వాత వైద్యులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు.
ఈ మాత్రలకు ఒక్కొక్కసారి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది.. అవగాహల లోపంతో వీటిని వినియోగిస్తే పలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది..
కొందరికి మానసిక సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటివి వస్తాయి… మూడ్ స్వింగ్స్ కు కారణమవుతాయి.. పార్శ్వ నొప్పి, వికారం వంటివి రావటానికి అవకాశం ఉంది.
మాత్రలు వాడటం ఆపేసిన తర్వాత కూడా శరీరం తిరిగి యద్ద స్థితికి రావటానికి కొంత సమయం తీసుకుంటుంది… కొందరికి పిసి ఓ ఎస్ , ఎండో మెట్రి మోసిన్ వంటి సమస్యల చికిత్సలో భాగంగా కూడా కుటుంబ నియంత్రణ మాత్రలను సూచిస్తారు.. అలాంటపుడు అప్పటికే వినియోగిస్తున్న విషయాన్ని వైద్యులకు చెప్పాలి.
‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/