త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ రాజీనామా

కొత్త సీఎంను ఎంపిక చేయ‌నున్న బీజేపీ

త్రిపుర‌ : త్రిపుర సీఎం ప‌ద‌వికి బిప్ల‌వ్ కుమార్ దేవ్ కాసేప‌టి క్రితం రాజీనామా చేశారు. త‌న రాజీనామాను త్రిపుర గ‌వ‌ర్న‌ర్ ఎస్‌.ఎన్‌. ఆర్య‌కు స‌మ‌ర్పించారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేర‌కే బిప్ల‌వ్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2018లో త్రిపుర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గా… గ‌డ‌చిన నాలుగేళ్ల పాటు ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే న‌డిపించారు. అయితే కార‌ణాలేమిటో తెలియ‌దు గానీ… ఉన్న‌ట్టుంది ఆయ‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు, ఈ నేప‌థ్యంలో బిప్ల‌వ్ స్థానంలో త్రిపుర సీఎం ప‌ద‌వికి మ‌రో కొత్త నేత‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయ‌నుంది.

కాగా, మ‌రో ఆరు నెల‌ల్లో త్రిపుర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇంత‌టి కీల‌క ప‌రిస్థితుల్లో సీఎం విప్ల‌వ్ దేవ్‌ను త‌ప్పించి, బీజేపీ కొత్త రాజ‌కీయ ప‌రిణామానికి దారి తీసింది. అయితే.. శ‌నివారం సాయంత్ర‌మే బీజేపీ అధిష్ఠానం కొత్త సీఎంను ప్ర‌క‌టించ‌నుంది. అయితే మ‌రో వాద‌న కూడా ఉంది. డిప్యూటీ సీఎంగా కొన‌సాగుతున్న జిష్ణుదేవ్ వ‌ర్మ‌ను ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. అయితే ఈ వార్త‌ను బీజేపీ అధికారికంగా ధ్రువీక‌రించ‌డం లేదు. మరోవైపు నూత‌న సీఎంగా ఎవ‌ర్ని ప్ర‌క‌టించాల‌న్న సందిగ్ధంలో బీజేపీ ప‌డిపోయింది. శ‌నివారం సాయంత్రం బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్షం భేటీ కానుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/