వాల్‌మార్ట్‌కు ఫ్లిప్‌కార్ట్‌ బిన్ని బన్సాల్‌ వాటా విక్రయం!

5.40 లక్షల షేర్లు విలువ రూ.531కోట్లు

Binny Bansal
Binny Bansal, Flipkart co-founder

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌కు విక్రయించిన తర్వాత వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్ని బన్సాల్‌ కొంత వాటాను 531 కోట్లకు తిరిగి వాల్‌మార్ట్‌కే విక్రయించారు. తాజాగా జరిగిన ఈ విక్రయంతో బిన్నిబన్సాల్‌ తన ఈక్విటీ వాటాను మొట్టమొదటిసారిగా నగదీకరణ చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. 12 ఏళ్ల తర్వాత వ్యవస్థాపకుల వాటాను అమ్ముకున్నారు. మొత్తం 54కోట్ల విలువైన ఈక్విటీ వాటాలను 531 కోట్లకు విక్రయించారు. వాల్‌మార్ట్‌ లగ్జెంబర్గ్‌ సంస్థ ఎఫ్‌ఐటి హోల్డింగ్స్‌కు విక్రయించినట్లు తేలింది. ఫ్లిప్‌కార్ట్‌లో తన ఈక్విటీ వాటాను పాత వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్‌ నుంచి 5,39,912 వాటాలను కొనుగోలుచేయడం ద్వారా తన వాటాను పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ స్టాక్‌ ఎక్చేంజీలకు ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే బన్సాల్‌ తన వాటాలను 76.4 మిలియన్‌ డాలర్లకు బదలాయించారని తేలింది. సహవ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వైదొలిగారు. వాల్‌మార్ట్‌ మొత్తం 77శాతం వాటాను కొనుగోలుచేసింది. 2018 మే 9వ తేదీ మొత్తం 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలుచేసిన సంగతి తెలిసిందే. మేనేజ్‌మెంట్‌ టీమ్‌లో బిన్నీ బన్సాల్‌ మాత్రం కొనసాగారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బిన్నీ కూడా రాజీనామా చేసారు. 2018 నవంబరు 13వ తేదీ నిష్క్రమించారు. వాల్‌మార్ట్‌ విచారణలో వ్యక్తిగత ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించడంతో బిన్నీ వైదొలిగారు.

తాజా విక్రయాల్లో బిన్నీ బన్సాల్‌ మొట్టమొదటి అమ్మకంగా ఈ విక్రయం కనిపిస్తోంది. బిన్ని ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు అమ్మిన తర్వాత కూడా 63,53,838 వాటాలు కలిగి ఉన్నారు. వాల్‌మార్ట్‌ టేకోవర్‌ నాటికి సుమారు 11,22,433 వాటాలను 159 మిలియన్‌ డాలర్ల విలువ కలిగిన వాటాలు బిన్నీ కలిగి ఉన్నారు. పేపర్‌డాట్‌ విసిసంస్థ అంచనాలప్రకారం బిన్ని బన్సాల్‌ తన వాటాను 0.33శాతం తగ్గించుకున్నారు. అంతకుముందున్న 3.85శాతం నుంచి 3.52 శాతానికి తగ్గించుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/