చింతమనేనిపై బైండోవర్‌ కేసు నమోదు

మరో 1160 మందిపై కూడా బైండోవర్‌ కేసులు నమోదు

Chinthamaneni Prabhakar
Chinthamaneni Prabhakar

అమరావతి: ఏపి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టిడిసి మాజీ ఎమ్మెల్యె చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరో 1160 మందిపై బైండోవర్‌ కేసులను పోలీసులు నమోదు చేశారు. కాగా జిల్లాలో మొత్తం 445 లైసెన్స్ ఉన్న తుపాకీలు ఉండగా వాటిలో 310 తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైండోవర్ కేసులు నమోదైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉండటంతో ఆయనను మండల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో, ఆరు నెలల పాటు అల్లర్లకు పాల్పడకుండా సత్ప్రవర్తతో ఉండాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/