బింబిసార ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Kalyan Ram look in Bimbisara movie

కళ్యాణ్ రామ్ బింబిసార ఓటిటి రిలీజ్ ఫిక్స్ అయ్యింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్..బింబిసార‌ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. థియేటర్స్ కు ప్రేక్షకులు రాని సమయంలో బింబిసార‌ తో మళ్లీ థియేటర్స్ కు కళ తీసుకొచ్చాడు. కేవలం రెండు వారాల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టిందంటే ఈ మూవీ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. సరికొత్త లుక్ లోనే కాదు నటనలోనూ కొత్తదనం చూపించి కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 ఓటీటీ దక్కించుకున్నది. తోలుత సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కారణంగా ఆలస్యంగా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 7న ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.