నాల్గు రోజుల్లోనే లాభాల బాట పట్టిన బింబిసార

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ నాల్గు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. గత కొద్దీ రోజులుగా థియేటర్స్ కు ప్రేక్షకులు రాకపోవడం తో చిత్రసీమ అంత కూడా అయోమయంలో పడిపోయింది. ఇక ప్రేక్షకులు థియేటర్స్ కు రాకపోవచ్చని అంత మాట్లాడుకుంటున్న సమయంలో శుక్రవారం విడుదలైన బింబిసార , సీతారామం చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టడంతో చిత్రసీమ ఊపిరి పీల్చుకుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండ థియేటర్స్ కు వస్తారని రుజువైంది.

ముఖ్యముగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్ర బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. నాల్గు రోజుల్లోనే ఈ మూవీ లాభాల బాట పట్టడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 350k డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో గత నాలుగు రోజుల్లో 1.12 కోట్ల షేర్, 2.8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆస్ట్రేలియాలో నాలుగో రోజున 31 లోకేషన్ల నుంచి 17297 ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది.

నాల్గు రోజుల్లో నైజాంలో 6.47 కోట్ల షేర్, 11.0 కోట్ల గ్రాస్, సీడెడ్‌లో 3.93 షేర్, 5.6 కోట్ల గ్రాస్ సాధించింది. వైజాగ్‌లో 2.58 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 83 లక్షలు, కృష్ణా జిల్లాలో 99 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.42 కోట్లు, నెల్లూరు జిల్లాలో 56 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో ఈ చిత్రం 20.57 కోట్ల షేర్, 34.2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 15 కోట్లుగా నమోదవ్వడంతో 16 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ సాధించాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం 4 కోట్లకుపైగా లాభంతో బింబిసార బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.