పవన్ కొత్త సినిమాకు టైటిల్ ఇదేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 30వ చిత్రాన్ని తాజాగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, మరో హీరోగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటిస్తున్నాడు. మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అయ్యప్పనమ్ కొషియమ్’ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి అప్పుడే ఫిలింనగర్ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఎవరనే అంశం మొదలుకొని, ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి – మోహన్ బాబు కలిసి నటించిన ‘బిల్లా రంగా’అనే సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు అదే టైటిల్‌ను పవన్ – రానా సినిమాకు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అటు పవన్ కూడా ఈ టైటిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. మరి పవన్-రానా చిత్రానికి నిజంగానే బిల్లా – రంగా అనే టైటిల్‌ను పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈ టైటిల్ పవన్ సినిమాకు ఫైనల్ అవుతుందా లేదా అనే ఆసక్తి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.