భారత ఆర్థిక వ్యవస్థపై బిల్‌గేట్స్‌ ప్రశంస

Bill Gates
Bill Gates

ఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భారత్‌ రానున్న దశాబ్ద కాలంలో చాలా వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు సంబంధించిన కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాబోయే కాలంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతుందని, దానివల్ల కోట్ల మంది పేదరికం నుంచి బయటపడతారని ఆయన అన్నారు. దాని కారణంగా ప్రభుత్వం విద్య, వైద్యం వంటి రంగాలపై మరింత ఖర్చు చేసే అవకాశం ఉంటుందని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌లో ఆధార్‌, యూపిఐ చెల్లింపు వ్యవస్థలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రజలు యూపిఐ, ఆధార్‌ సేవలను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. నందన్‌ నీలెకని వంటి వారితో భాగస్వామ్యం కావాలనుకుంటున్నామని, తద్వారా డిజిటల్‌ గుర్తింపులు, ఆర్థిక సేవలు వంటి రంగల్లో ఇతర దేశాలు భారత్‌ నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చుననే దానిపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు. అంతేకాకుండా భారత్‌ వ్యాక్సిన్‌ తయారీ రంగంలో అగ్రగామిగా నిలిచి, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న తీరును బిల్‌గేట్స్‌ కొనియాడారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana