ప్రధాని మోడీకి బిల్‌గేట్స్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : ప్రధాని మోడీకి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ స్పందించారు. భారత్‌లో ఆరోగ్య లక్ష్యాలను సాధించడానికి ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుందని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు.

అలాగే దేశంలో వైద్య సేవలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా ఈ మిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు. కాగా, ఈ పథకం కింద దేశంలోని ప్రజలందరికీ హెల్త్ ఐడీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ ద్వారా దేశంలోని వైద్యరంగం కొత్త దశలోకి అడుగు పెడుతుందని మోడీ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/