బిల్కిస్ బానో కేసు.. గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః నేడు సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో రేప్ కేసు నిందితుల్ని రిలీజ్ చేసిన అంశంపై విచార‌ణ జ‌రిగింది. 11 మంది నిందితుల రిలీజ్ గురించి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పంద్రాగాస్టు రోజున బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిని గుజ‌రాత్ ప్ర‌భుత్వం రిలీజ్ చేసింది. కాలం చెల్లిన రెమిష‌న్ విధానం ప్ర‌కారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగుతోంది. గుజ‌రాత్ ప్ర‌భుత్వ తీరును విప‌క్షాలు ఖండిస్తూ నిల‌దీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో దాఖ‌లైన పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నిందితుల విడుద‌ల గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని కోరింది. 2002లో గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానోపై అత్యాచారం జ‌రిగింది. ఆ కేసులో 11 మంది నిందితులుగా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/