నేడు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే భిక్షమ‌య్య గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తన స్పీడ్ పెంచింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల గెలుపు తో పార్టీ లో కొత్త ఉత్సహం పెరిగింది. తెరాస ను ఎదురుకోవాలంటే ఒక్క బిజెపి పార్టీనే అనేలా నేతలు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీ ల నేతలను తమ పార్టీ లోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఈరోజు టీఆర్‌ఎస్‌ నేత బూడిద భిక్షమయ్య గౌడ్‌ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు.

ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జీ త‌రుణ్ చుగ్ స‌మ‌క్షంలో భిక్షమ‌య్య గౌడ్.. బీజేపీలో చేరనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ తో పాటు ప‌లువురు కీల‌క నాయ‌కులు పాల్గొన్నారు. కాగ భిక్షమ‌య్య గౌడ్.. బీజేపీలో చేరుతున్న నేప‌థ్యంలో ఒక లేఖ‌ను కూడా విడుద‌ల చేశారు. ఆ లేఖ‌లో భిక్షమ‌య్య గౌడ్… ఆలేరు నియోజ‌క వ‌ర్గం అభివృద్ధి కోసం 2018 లో టీఆర్ఎస్ లో చేరాన‌ని అన్నారు. అభివృద్ధి లో త‌న‌ను భాగ‌స్వామిని చేస్తార‌ని భావించాన‌ని అన్నారు. కానీ త‌న‌ను ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. ఆలేరు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి త‌న‌ను వేరు చేయాల‌ని కుట్ర చేశార‌ని మండిప‌డ్డారు. నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌లతో తాను స‌మావేశం కావ‌ద్ద‌ని టీఆర్ఎస్ పెద్ద‌లు త‌న‌ను ఆదేశించార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల నుంచి త‌న‌ను వేరు చేయాల‌ను కుట్ర‌ను తాను ఛేదిస్తున్నాన‌ని అన్నారు. ఆలేరు నియోజ‌క వ‌ర్గం ప్ర‌జ‌ల కోసం బీజేపీలో చేరుతున్న‌ట్టు లేఖ‌లో ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన భిక్షమయ్య గౌడ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా పనిచేశారు.. గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి తప్పలేదు.. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, 2019లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆలేరులో టీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆయన ఈరోజు బీజేపీ లో చేరారు.