ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌..నిర్మల

బీహార్‌లో ఎన్నికల్లో బిజెపి మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

BJP-Promises-19-Lakh-Jobs-Free-Covid-Vaccination-In-Bihar-Manifesto

పట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. ఎన్నికల నేపథ్యంలో ‌ బిజెపి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.  బీహార్‌లో కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.  తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారమన్ తెలిపారు.  

బీహార్‌లో ప్ర‌తి ఒక ఒక్కరికీ ఉచితంగా ఆ టీకా ఇస్తామన్నది ఈ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని అన్నారు.  ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాల‌ని అన్నారు. బీహార్‌లో మ‌రో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా  అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పుకొచ్చారు. బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం,  30 లక్షల మందికి పక్కా ఇళ్లు,  9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బిజెపి తమ మేనిఫెస్టోలో చేర్చింది.

బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ఇతర హామీలు..


• రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు..

• మూడు లక్షల ఉపాద్యాయ ఉద్యోగాలు.
• ఆరోగ్య రంగంలో లక్ష ఉద్యోగాలు.
• ఐటీ హబ్‌గా బిహార్‌ అభివృద్ధి .
• తొమ్మిది, పై తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు.
• గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి ఉచిత ఇళ్లు.
• ఇతర రాష్ట్రాలలో మృత్యువాత పడ్డ వలస కూలీ కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.
• దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/