నితీష్‌ కుమార్‌తో సమావేశమైన జేపీ నడ్డా!

నితీష్‌ కుమార్‌తో సమావేశమైన జేపీ నడ్డా!
Nitish Kumar and JP Nadda

పాట్నా: బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం పాట్నాకు వ‌చ్చారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బీహార్ సిఎం నితీష్ కుమార్‌తో జేపీ న‌డ్డా స‌మావేశమైన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి సీట్ల పంపిణీపై ప్ర‌ధాన చ‌ర్చ జ‌రిగినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే విధంగా గెలుపు కోసం వ్యూహాలు రూపొందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. నితీష్ నివాసంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి మ‌హారాష్ర్ట మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, బిజెపి నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ భూపేంద్ర యాద‌వ్‌తో పాటు ప‌లువురు హాజ‌రైన‌ట్లు స‌మాచారం.

బీహార్ శాస‌న‌స‌భ‌ ఎన్నికల్లో బిజెపి జనతాదళ్ (యునైటెడ్) జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కూటమిదే విజయమని గ‌తంలో జేపీ న‌డ్డా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌రాం మాంఝీకి చెందిన హిందూస్థానీ అవామ్‌ మోర్చా పార్టీ (హెచ్‌ఏఎం) కూడా ఏన్డీఏలో చేర‌నుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/