బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ నువ్వు ఉన్నావా..? అంటూ నాగ్ పరువు తీసాడు

బిగ్ బాస్ 5 మొదలై అప్పుడే వారం అవుతుంది. గత సీజన్ల మాదిరిగా శనివారం , ఆదివారం నాగార్జున రావడం వారం రోజుల పాటు హౌస్ లో జరిగిన విషయాల గురించి చర్చించడం, సబ్యులకు క్లాస్ కు పీకడం చేయడం చేసారు. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో ను విడుదల చేసారు.

ప్రోమో లో ముందుగా నాగ్..బిగ్ బాస్ సీజన్ 5 కి మొదటి కెప్టెన్‌ అయినా సిరిని మనస్ఫూర్తిగా అభినందించాడు. అనంతరం హౌస్‌లో ఆర్జే అవతారమెత్తి అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా అని కాజల్‌ ఫై కామెంట్స్మీ చేసాడు. బిగ్‌బాస్‌ షోకి వచ్చీరావడంతోనే తనకు పూలబాణం వేసిన లహరితో మాట్లాడుతూ.. నీ దగ్గరున్న రోజా పువ్వును వచ్చే వారమైనా ఎవరో ఒకరికి ఇస్తావని ఆశిస్తున్నానన్నాడు. ఇక కడుపుబ్బా నవ్విస్తున్న లోబో కామెడీకి చప్పట్లు కొట్టిన నాగ్‌.. షణ్ముఖ్‌ ఎక్కువగా కెమెరాల్లో కనిపించకపోవడాన్ని ప్రస్తావించాడు. ‘అరేయ్‌ ఏంట్రా ఇది? కొంచెం కనబడరా.. వన్‌ వీక్‌ అయిపోయింది, ఆట మొదలెట్టరా!’ అని సెటైర్‌ వేయడంతో షణ్నూ సిగ్గుతో ముడుచుకుపోయాడు. మొత్తం మీద ఈ ప్రోమో తో ఈరోజు జరగబోయే ఎపిసోడ్ ఫై మరింత ఆసక్తి పెరిగింది.

YouTube video