బిగ్ బాస్ 5 : లోబో ను ప్రపోజ్ చేయమన్న ప్రియ..మానస్ పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ 5 : లోబో ను ప్రపోజ్ చేయమన్న ప్రియ..మానస్ పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ 5 మొదలై నాల్గు రోజులు అవ్వలేదు ..అప్పుడే ప్రేమలు , ఈర్షలు మొదలయ్యాయి. తాజాగా ఈరోజుకు సంబదించిన ఎపిసోడ్ తాలూకా ప్రోమోను రిలీజ్ చేసారు స్టార్ మా. ఈ ప్రోమో లో తన దగ్గర ఉన్న ఒక రోజా పువ్వు ను మానస్ చేతికి ఇస్తుంది ప్రియ. నువ్వు కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ పువ్వుని నాకు ఇవ్వు అంటూ చెబుతుంది. అందుకు మానస్ కూడా ఎంతగానో సంతోషిస్తాడు.

ఆ తర్వాత రెస్ట్ రూమ్ లో ఎప్పటిలాగే పని చేసుకుంటూ ఉన్న లోబో ప్రియాంక రావడాన్ని గమనిస్తాడు. కాకపోతే కాస్త విభిన్నంగా చూడడంతో వెంటనే ప్రియాంక నువ్వు నన్ను చేస్తున్నావని మానస్ కు కంప్లైంట్ చేస్తాను. నీకు దమ్ముంటే మానస్ ముందు నాకు లైన్ వేయి..అంటూ ప్రియాంక లోబోకు ఒక హెచ్చరిక చేసి వెళ్తుంది. ప్రియ హెచ్చరిక తో ఖంగ్ తింటాడు లోబో.

ఇక అప్పుడే మానస్ వాష్ రూమ్ లోకి రావడంతో ఆ విషయాన్ని లోబో అతనికి చెబుతాడు. నేను ప్రియాని ప్రపోజ్ చేయాలని అనుకున్నాను. కానీ ఆమె ఎమన్నది అంటే. ఫస్ట్ వెళ్లి మానస్ వెళ్లి మాట్లాడు అని చెప్పింది.. అని లోబో చెప్పాడు. ఇక ఆ మాటలకు మానస్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. మానస్ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు లోబో ఆమ్మో ఆమ్మో వద్దురయ్యా అంటూ తనదైన శైలిలో చెపుతాడు. ఈ ప్రోమో తో ఈరోజు ఎపిసోడ్ లో ఏంజరగబోతుందనే ఆసక్తి నెలకొని ఉంది.