కేసీఆర్ కూతురి ఆస్తుల ఫై విచారణ జరపాలంటూ ఈడీ కి పిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత

ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఆస్తుల ఫై విచారణ జరపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేసారు. హైదరాబాద్‌లోని జాయింట్ డైరెక్టర్‌కు బుధవారం ఆయన లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. కవిత 2014లో లోక్‌సభ ఎన్నికల్ పోటీచేసినప్పటి నుంచి ఆమె స్థిరాస్తులు, చరాస్తులు, కంపెనీల్లో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని జడ్సన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఈడీకి సమర్పించారు.

కవిత భర్తకు సంబంధించిన పెట్టుబడులు, పలు కంపెనీల్లో ఉన్న పదవుల గురించి వివరాలు అందించారు. ఈ ఏడేళ్ళ కాలంలో ఎక్కడెక్కడ ఎంతెంత వ్యవసాయ భూములు, నివాస స్థలాలు కొనుగోలు చేశారు, ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ ఎంత ఉందో కూడా ఆ ఫిర్యాదుతో జతచేశారు. కవిత తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని జడ్సన్ ఆరోపించారు. దీనికి సంబంధించి జూలై 10న ఈడికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని అందుకే మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్టు జడ్సన్ పేర్కొన్నారు.