బిగ్‌ బాస్‌ మిత్రబృందంతో రాహుల్‌ సిప్లిగంజ్‌ పార్టీ

బిగ్ బాస్3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్


Rahul Sipligunj After Winning Bigg Boss Title | Varun Sandesh | punarnavi bhupalam | Vithika Sheru

హైదరాబాద్‌: బిగ్ బాస్3 రియాల్టీ షో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో టాలీవుడ్ యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచి రూ.50 లక్షలు ఎగరేసుకెళ్లాడు. ఇక, షో పూర్తికావడంతో హౌస్ నుంచి బయటికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ తన బిగ్ బాస్ మిత్రబృందం వరుణ్ సందేశ్, వితిక, పునర్నవిలతో కలిసి ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఈ నలుగురు ఓ గ్యాంగ్ గా ఏర్పడి చివరి వరకు అదే స్నేహబంధం కొనసాగించారు. మధ్యలో రాహుల్, వరుణ్ మధ్య వివాదం వచ్చినా అది టీ కప్పులో తుపాను మాదిరే సమసిపోయింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/