Biggboss5: ముఖం పగిలిపోద్ది అంటూ లోబోకు సిరి వార్నింగ్..అండర్ వేర్‌ను ఓపెన్ చేసి చూపించిన లోబో

బిగ్ బాస్ 5 సీజన్ తెలుగులో ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. డే 1 సభ్యుల ఎంట్రీ ..డే 2 నామినేషన్స్ కాగా డే 3 లో హౌస్ లో అసలైన రచ్చ మొదలైంది. సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. సిరి హన్మంతు – లోబో , లహరి షారి – ఆర్జే కాజల్ మధ్య గొడవలు జరిగినట్లు చూపించారు.

సిరి హన్మంతు మరొకరితో ఏదో చెబుతుంటే… లోబో మధ్యలో వెళ్లి నీకు నాతో ప్రాబ్లెం ఉంటే నాకు చెప్పు. వాళ్లకు వీళ్లకు చెప్పకు అని అంటే.. వెళ్లు వెళ్లు అంటూ సిరి హన్మంతు కౌంటర్ ఇచ్చింది. దాంతో సక్కగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు లోబో చేస్తే.. నన్ను కెలికితే ఇలానే ఉంటుంది అంటూ సిరి హన్మంతు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. సిరి హన్మంతు కెలికితే అనే పదం ఉపయోగించడంతో లోబో మరో కౌంటర్ ఇచ్చారు. నిన్ను కెలకడానికి నాకు వేరే పని ఏమిలేదా? అంటే.. ఇక్కడ ఎవరికి ఏమీ పనిలేదు అంటూ సిరి సమాధానం ఇచ్చింది. దాంతో వెళ్లి అద్దంలో ముఖం చూసుకో అంటూ లోబో సెటైర్ వేశాడు. ముఖం గురించి మాట్లాడితే.. ముఖం పగిలిపోద్ది అంటూ సిరి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే లహరి షారీకి ఆర్జే కాజల్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తుంది. మరి ఆ గొడవ ఏంటి అనేది షో చూస్తే తెలుస్తుంది.

అలాగే లోబో బిగ్ బాస్ సాక్షిగా ఓ విన్నపం చేసాడు. నేను చెప్పేది వెరీ సీరియస్.. బాత్రూంల జాంగాలు (అండర్ వేర్), బనీన్లు ఉంటే బయట ఆరా పెట్టుకోండి. లేకపోతే ఇలా ఉంటుంది అంటూ ఓ అండర్ వేర్‌ను ఓపెన్ చేసి చూపించాడు. దాంతో మరీ ఎక్కడ పెట్టుకోవాలి అంటే.. నా జేబులో పెట్టుకో అంటూ లోబో తనదైన శైలిలో స్పందించాడు. ఇది చాల ఫన్నీ గా ఉన్నట్లు ప్రోమో లో చూపించారు.

#5MuchDrama between #Lobo & #Siri also between #Kajal & #Lahari … Let’s wait & watch#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/pp4PDcmHGl— starmaa (@StarMaa) September 7, 2021

Power room ki #Vishwa entry.. #Ravi & #Priya luggage goes for a toss!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa

#FiveMuchFun pic.twitter.com/oqot6Kf5ET— starmaa (@StarMaa) September 7, 2021