రొమాన్స్ కు అడ్డగా మారిన బిగ్ బాస్..బట్టలు విప్పి మరి

రొమాన్స్ కు అడ్డగా మారిన బిగ్ బాస్..బట్టలు విప్పి మరి

సండే వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్ లో సందడి మాములుగా ఉండదు. సభ్యుల మధ్య ఫన్నీ టాస్క్ లు , గేమ్స్ పెట్టి సభ్యులనే కాదు ప్రేక్షకులను సైతం అలరిస్తుంటాడు నాగ్. ఈ సండే కూడా అంతకు మించి అన్నట్లు ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. నిన్నే పెళ్లాడుతా సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో స్పెషల్ పర్ఫామెన్స్‌లు చేసినట్టున్నారు. గ్రీకు వీరుడు, ఎటో వెళ్లిపోయింది మనసు అంటూ పాటలకు కంటెస్టెంట్లు స్టెప్పులు వేశారు. దీనిలో భాగంగా విశ్వ, ప్రియాంక సింగ్‌లు రెచ్చిపోయారు. ఇక విశ్వ అయితే తన బాడీని చూపించేశాడు.

విశ్వ షర్ట్‌ను ప్రియాంక సింగ్ విప్పేసింది. ఇక ఆ తరువాత ఇద్దరూ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో రెచ్చిపోయారు. ఆ దెబ్బకు అందరూ ఫిదా అయ్యారు. నాగార్జున వేసిన పంచ్‌కు మానస్ షాక్ అయ్యాడు. డ్యాన్స్ చేస్తున్నంత సేపు నేను మానస్‌ను చూస్తున్నాను అంటూ నాగార్జున ఇరికించేశాడు. ఇక చివర్లో మానస్, ప్రియాంక మధ్య ఓ టాస్క్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆ టాస్క్ ఆడుతున్న సమయంలోనే మానస్ ప్రమాదానికి గురయ్యాడు. కాలు జారి స్విమ్మింగ్ పూల్‌లో పడ్డాడు. అయితే అలా ప్రమాదం జరగడంతో ఇంటి సభ్యులతో పాటుగా నాగార్జున కూడా షాక్ అయ్యాడు. మరి మానస్ కు ఏమైనా దెబ్బలు తగిలాయా..లేదా అనేది ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది. ఇక శనివారం ఎపిసోడ్ లో లోబో , షణ్ముఖ్ లకు నాగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Housemates celebrates #25YearsOfNinnePelladatha for King @iamnagarjuna ❤️ .. Special telecast today at 3 PM#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun #SundayFunday pic.twitter.com/IBTsipJGs2— starmaa (@StarMaa) October 3, 2021