బిగ్ బాస్ 5 : హౌస్ లో మొదలైన లవ్ ట్రాక్..?

తెలుగు లో బిగ్ సీజన్ 5 గ్రాండ్ గా మొదలైంది. అన్ని సీజన్ల మాదిరిగానే హౌస్ లో అల్లర్లు , గొడవలు , ఏడుపులు , ప్రేమలు మొదలయ్యాయి. ప్రేక్షకులు గొడవలనే కాదు లవ్ ట్రాక్ ను కూడా ఎంతో ఇంట్రస్ట్ గా చూస్తుంటారు. అందుకే బిగ్ బాస్ సైతం హౌస్ లో లవ్ ట్రాక్ ఫై కెమెరా ను పెడుతుంటారు. ఇప్పటివరకు జరిగిన నాల్గు సీజన్లలో లవ్ ట్రాక్ నడిచాయి. మొదటి సీజన్‌లో ప్రిన్స్.. దీక్షా పంత్, రెండో సీజన్‌లో తేజస్వీ మదివాడ.. సామ్రాట్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం, నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ సహా ఎంతో మంది ప్రేమికులుగా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికి మీడియా లో వారిని ప్రేక్షకులు అలాగే చూస్తుంటారు. ఇక తాజాగా మొదలైన ఐదో సీజన్ లోను లవ్ ట్రాక్ మొదలుకాబోతుందని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హౌస్ లో 19 మంది సభ్యులను పంపించారు. అందులో ఆడవాళ్లు 9 మంది, మగవాళ్లు 9 మంది ఉన్నారు. తద్వారా తమ దృష్టిలో అందరూ సమానమే అని చాటి చెప్పారు. ఇక, ఈ సీజన్‌లో ప్రియాంక సింగ్ అలియాస్ సాయితేజ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్నాడు సాయితేజ. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఆఫర్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రియాంక హౌస్ లో అందరితో కలివిడిగా ఉంటూ..టాస్క్ లలో పాల్గొంటూ ఆకట్టుకుంటుంది.

ఇక మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ప్రియాంక సింగ్‌ను చుట్టుముట్టిన సభ్యులు పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే యాంకర్ రవి ‘నువ్వు నన్ను అన్నయ్య అంటున్నావు. మిగతా వాళ్లను కూడా బ్రదర్ అనే పిలుస్తున్నావు. మరి మానస్‌ను మాత్రం ఎందుకు అలా పిలవట్లేదు’ అని ప్రశ్నించాడు. దీనికి ప్రియాంక ‘నేను ఆయనను అలా పిలవను. తను నాకు బ్రదర్ లాంటోడు కాదు’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఇద్దరూ సిగ్గు పడిపోయారు. ఆ సమయంలో ‘ఎటో వెళ్లిపోయింది మానసు’ అంటూ పాట పాడి కాసేపు ఇద్దరినీ ఏడిపించారు. ఇక సోషల్ మీడియా లో అయితే ప్రియాంక – మానస్ ల మధ్య లవ్ ట్రాక్ మొదలు కావడం ఖాయం అంటూ కామెంట్స్ వేస్తున్నారు. మరి చూడాలి బిగ్ బాస్ హౌస్ లో ఏంజరుగుతుందో..