మోనాల్ ముద్దుతో అవినాష్ ఆనందం

బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ హైలైట్

మోనాల్ ముద్దుతో అవినాష్ ఆనందం
Monal Kisses Avinash

తెలుగు బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో అవినాష్ కు మోనాల్ పెట్టిన ముద్దు హైలైట్ గా నిలిచింది. మోనాల్ ముద్దు పెట్టడంతో అవినాష్ ఆనందంకు అవధులు లేకుండా పోయాయి.

నా పొలంలో మొలకలు వచ్చాయ్ అంటూ ఆనందంతో ఎగిరి గంతేశాడు. మోనాల్ మనసులో ఉన్న ‘ఏ’ నేనే అంటూ అవినాష్ సంతోషంతో డాన్స్ కూడా వేశాడు.

దానికి మోనాల్ సిగ్గు పడుతూ మాటలు రాక నవ్వుతూ ఉండి పోయింది. ఆ సమయంలో అఖిల్ కూడా క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్యూ అంటూ గట్టిగా నవ్వేశాడు.

అవినాష్ మరియు అరియానాలు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. ప్రాణంకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లి పోయినప్పుడే నేను చాలా ధైర్యంగా నిలబడ్డాను.

అలాంటిది చిన్న చిన్న విషయాలకు నేను బాధపడాల్సిన అవసరం లేదు అంటూ అవినాష్ అంటున్న సమయంలో పక్కనే ఉన్న అఖిల్ వద్దకు వెళ్లి మోనాల్ కూర్చుంది.

అప్పుడు అవినాష్ సరదాగా ఇటు వస్తానంటూ అటు వెళ్లావు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నీవు ఇక్కడకు వచ్చి కూర్చుంటాను అని చెప్పి అటు వెళ్లావు అంటూ మోనాల్ పై అవినాష్ అసహనం వ్యక్తం చేయడంతో మోనాల్ అక్కడ నుండి వచ్చి అవినాష్ నుదుటిపై ముద్దు పెట్టింది.

అవినాష్ కు ముద్దు పెట్టి మళ్లీ అఖిల్ వద్దకు వెళ్లి కూర్చుంది. అప్పుడు అవినాష్ నేనే కొద్ది సమయం అఖిల్ తో మాట్లాడు అంటూ పంపించాను ప్రేక్షకులు ఏమనుకోవద్దు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

ఒక వైపు అరియానాతో పులిహోరా కలుపుతూనే మరో వైపు మోనాల్ తో కూడా అవినాష్ పులిహోరా కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే అవినాష్ ఏం చేసినా కూడా జోక్ గానే అంతా అనుకుంటున్నారు. ఆయన్ను ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు. 

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/