నాగార్జున ఇంటిని ముట్టడించిన ఓయూ జేఏసీ

Bigg-Boss-3
Bigg-Boss-3

హైదరాబాద్‌: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్3 నిరసనల సెగ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కూడా తగిలింది. తెలుగు బిగ్ బాస్3కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఇంటిని ఈరోజు ఉస్మానియా జేఏసీ ముట్టడించింది. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు బిగ్ బాస్3 కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు ఈ కార్యక్రమం హోస్ట్ గా నాగార్జున తప్పుకోవాలని నినాదాలు ఇచ్చారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో నాగార్జున ఇంటి వద్ద మోహరించిన పోలీసులు పలువురు
8 మందిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/