కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్

ఏపీలో వైసీపీ దూకుడు ఎలా ఉందొ చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన ఓటర్లు వైసీపీ కే పట్టం కడుతూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నేతలు సైతం తమ పార్టీలకు రాజీనామా చేసి వైసీపీ లో చేరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో కీలక నేత, మండల అధ్యక్షుడిగా ఉన్న పామర్తి శ్రీనివాసరావు పార్టీకి వైసీపీ పార్టీ కి మాత్రమే కాదు ఏఎంసీ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వైసీపీ కి షాక్ ఇచ్చారు.

గత కొంతకాలంగా ఆయన పార్టీలో అసంతృప్తితోనే కొనసాగుతూ వస్తున్నారు. కొన్నేళ్లుగా వైసీపీలో ఉన్న ఈయన్ను పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదని పామర్తి అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. దీనికి తోడు మైలవరం పార్టీ ఇంచార్జి నారాయణకు, పామర్తికి మధ్య గొడవలు వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న సమస్యలను అధిష్టానం పరిష్కరించకపోవడం గమనార్హం. వీటికంటే ప్రధానమైంది కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక పామర్తి రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఎన్నికలో అధికార వైసీపీ ఓటమిపాలవ్వడంతో సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేసారని అంటున్నారు.