షర్మిల కు భారీ షాక్..కీలక నేత రాజీనామా

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని షర్మిల ..రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు పార్టీ పనుల్లో నిమగ్నమై షర్మిల ఉంటె..మరోపక్క పార్టీ లోని కీలక నేతలు వరుస పెట్టి రాజీనామాలు చేయడం షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటికే శోభన్‌‌ , చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి లు పార్టీ కి రాజీనామా చేయగా..తాజాగా పాలమూరు జిల్లాకు చెందిన ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడ పోవడం వల్లే రాజీనామా చేయాల్సి వస్తుందని నేతలు చెపుతున్నారు.

ఇలాగే కొనసాగితే తెలంగాణ పార్టీ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఇంకా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లకముందే పార్టీ కార్యవర్గం రాజీనామాలు చేస్తుండటంతో మిగతా సభ్యులూ కలవరపడుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి పార్టీలో తగిన గుర్తింపు లేదని రాజీనామా చేయగా, ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ మహమ్మద్ ఇబ్రహీం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది చేస్తారో అని కార్య కర్తలు ఖంగారుపడుతున్నారు.